17-08-2025 12:23:06 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : ఇటీవల మరణించిన జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ కుటుంబాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. జార్ఖండ్ రా ష్ర్టం రామగఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో శనివారం శిబూ సోరెన్ సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని శిబూ సోరెన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన సంతాపం తెలిపారు. హేమంత్ సోరెన్‌తో రేవంత్‌రెడ్డి కాసేపు మాట్లాడారు.