calender_icon.png 18 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి

17-08-2025 12:21:32 AM

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మాజీ ఎంపీ, టిపిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కామాన్ వద్ద శ్రీ కృష్ణాష్టమి, బాలకిషన్ శర్మ జయంతిని పురస్కరించుకొని సుమారు 6 వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వం హాయాంలో జరిగిన ఆర్ధిక దోపిడిని నిలదొక్కుకో వడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వినయ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్ద మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల లోకేష్ యాదవ్, మారిశెట్టి నర్సింగరావు, జగదీష్, బాబురావు, బాలకృష్ణ యాదవ్, పవన్ చంద్ర, పాండు, శివ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.