యథావిధిగా పెద్దమల్లారెడ్డి పీఏసీఎస్ పాలకవర్గం
06-05-2026 12:59 AM
భిక్కనూర్, మే 5 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో హైకోర్టు ఆదేశాల మేరకు పాలకవర్గాన్ని యథావిధిగా మళ్లీ పునర్నియమించారు. అధ్యక్షుడిగా బాలాగౌని రాజాగౌడ్, ఉపాధ్యక్షుడిగా గుడిసె విఠల్తో పాటు డైరెక్టర్లను కొనసాగించారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తూ రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అధ్యక్షుడు రాజాగౌడ్ తెలిపారు. సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు ప్రయోజనం చేకూరేలా పని చేయాలని సీఈఓ మోహన్ గౌడ్ సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.






