05-10-2025 04:39:22 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని తాటికల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలతో నైవేద్యం ప్రసాదించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మిర్యాల చంద్రశేఖర్, గాధగోని శ్రీలత కొండయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పొల్లగొని వెంకటేష్, నాయకులు కారింగు ఆంజనేయులు, ఆలయ చైర్మన్ బంటు రవి, వైస్ చైర్మన్ మండల కృష్ణ, కమిటీ సభ్యులు బంటు రామలింగయ్య, కారింగు యాదయ్య, మండల కాటమయ్య, పొల్లగోని శంకర్, ముచ్చపోతుల జానయ్య తదితరులు పాల్గొన్నారు.