calender_icon.png 5 October, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాక జయంతి వేడుకలు

05-10-2025 04:37:18 PM

మందమర్రి (విజయక్రాంతి): దివంగత మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ కురవృద్ధులు స్వర్గీయ(కాక) గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బి1 క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాకా జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. అంతకుముందు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, నాలుగు పర్యాయాలు కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిరుపేదల, కార్మిక పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు.

ముఖ్యంగా బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టి గని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్, నోముల ఉపేందర్ గౌడ్, పుల్లూరి లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్, మంద తిరుమల్ రెడ్డి, ఏడుకోల పవన్, జావిద్ ఖాన్, ఎర్ర రాజు, రాచర్ల గణేష్, ఆకారం రమేష్, బేర వేణు గోపాల్, శశిధర్, వేముల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.