calender_icon.png 5 October, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లికి ఉమ్మడి జిల్లా నేతల నివాళులు

05-10-2025 07:18:17 PM

హనుమకొండ (విజయక్రాంతి): నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ మరణం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల నివాళులు అర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండలోని దొంతి మాధవరెడ్డి నివాసానికి వెళ్లి కాంతమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాధవరెడ్డి పరామర్శించిన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగిని రాజేందర్రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బస్వారాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు, మరదలు పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కన్నేబోయిన రాజయ్య యాదవ్,ఇతర ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.