13-07-2025 05:47:40 PM
నస్పూర్ (విజయక్రాంతి): నస్పూర్ లోని సాధన స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ అకాడమి(Sadhana Sports and Defence Academy)లో నిర్వహించిన పెన్కాక్ సిలాట్ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ రాష్ట్ర పెన్కాక్ సిలాట్ ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్ హాజరై క్రీడాకారులకు మెలకువలు నేర్పించారు. శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఉద్యోగాలలో ఈ సర్టిఫికెట్ ద్వారా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్కాక్ సిలాట్ చైర్మన్ రంగ రమేష్, అధ్యక్షులు పోచంపల్లి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొండబర్తి సందీప్, కోశాధికారిగా మెయిన్ ఖాన్, ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఆకుతోట నరేష్ తదితరులు పాల్గొన్నారు.