13-07-2025 05:37:38 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల(Golden Jubilee celebrations)ను ఆదివారం నిర్వహించారు. 1973-1974 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమకు విద్య బోధన చేసిన గురువుల గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుసుమ బాల్ కిషన్, వెంకట రాజయ్య, గోవిందులాల్, దిగంబర్, చంద్రకాంత్, యాద రమణ రావు, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.