calender_icon.png 3 May, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి

03-05-2025 12:25:38 AM

- తెలంగాణ పాడి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్లు నర్సింహులు, జంగారెడ్డి 

ఎల్బీనగర్, మే 2 : మదర్ డైయిరీ పాలక వర్గం పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ పాడి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్లు మంగా నర్సింహులు, జంగారెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

హయత్ నగర్ లోని మదర్ డైయిరీ లో పాలక మండలి సభ్యులకు శుక్రవారం రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా నర్సింహులు, జంగారెడ్డి మాట్లాడుతూ... మదర్ డైరీ మూడు నెలలుగా పాడి రైతులకు రూ. 64 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. మదర్ డైయిరీ రైతులకు 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించాల్సి ఉండగా మూడు నెలల నుంచి బిల్లు చెల్లించడం లేదని తెలిపారు. 

 అనేకమంది రైతులు మదర్ డైయిరీ సంస్థకు పాలు పోసే రైతులు ఇతర డైయిరీలకు వెళ్తున్నారని, ఇందుకు మదర్ డైయిరీ పాలకవర్గమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.. రైతులకు ఇవ్వాల్సిన ఆరు నెలల పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలి, లీటరుకు ఐదు రూపాయల ప్రోత్సాహకం వెంటనే రైతుల ఖాతాలో జమ చెయ్యాలని డిమాండ్ చేశారు.

50 శాతం సబ్సిడీపై పాడి సంరక్షణ మందులు, గడ్డి విత్తనాలు ఇవ్వాలని, పాలు టెస్టర్లు చాప్టర్లు మిల్క్ అనలైజర్లు సరఫరా చేయాలి అని కోరారు. పశుపోషణ పథకాన్ని అమలు చేస్తూ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. రైతులకు వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించాలి, ప్రిమియాన్ని  ప్రభుత్వమే చెల్లించాలని , ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మ డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ పాడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సంధిలా భాస్కర్ గౌడ్, కోశాధికారి దొంతరి సోమిరెడ్డి సోమిరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, సహాయక కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు బండి నాగయ్య, మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మహేందర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.