calender_icon.png 3 May, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం

03-05-2025 12:24:34 AM

టాపర్ విద్యార్థిని సన్మానించిన పసుమర్తి 

కల్లూరు,మే2(విజయ క్రాంతి) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో 600 గాను 567 మార్కులు సాధించి లిటిల్ ఫ్లవర్ ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ టాపర్ గా మరియు  టౌన్ లో 2వ ర్యాంక్, మండలంలో 3వ ర్యాంకర్ గా నిలిచి ప్రతిభ కనపరిచిన సానిక శ్రీనివాసరావు  కుమార్తె అయిన సానిక లక్ష్మి సంజన నీ ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ మరియు మండల కాంగ్రెస్ సినియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు  శాలువా కప్పి సన్మానం చెయ్యడం జరిగింది.

ఉన్నత చదువులు ద్వారా గ్రామానికి, మండలానికి మి తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకోని రావాలి అని విద్యార్థిని ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మి సంజన కీ శుభాకాంక్షలు తెలిపారు