calender_icon.png 29 May, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఇందోజు రమేశ్ ఏకగ్రీవం

03-05-2025 12:26:22 AM

కల్లూరు, మే 2 విజయ క్రాంతి కల్లూరు మండల నూతన లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఇందోజు రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గురువారం రాత్రి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశం లయన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ చలువాది నగేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో కల్లూరు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షునిగా ఇందోజు రమేష్, సెక్రటరీ కిన్నెర ఆనందరావు, ట్రెజరర్ దారా శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ రాయల మురళీధర్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీనీ శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో గంగుల నారాయణరావు, రాయల నాగేశ్వరరావు, చారుగుండ్ల. అచ్యుతరావు, గులివెందుల. అప్పలనాయుడు, గుర్రం చిన్న శీను ,అనుమోలు. వెంకటేశ్వరరావు, దారా శ్రీనివాసరావు, పసుమర్తి రాంబాబు, అనుమోలు మురళి, అనుమోలు శ్రీనివాసరావు,మాజీ అధ్యక్షులు కొప్పరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.