calender_icon.png 26 July, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

24-07-2025 12:17:41 AM

సిద్దిపేట, జులై 23 (విజయక్రాంతి): గ్రామపంచాయతీలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుగు స్వామి కోరారు బుధవారం సిద్దిపేట అర్బన్ ఎంపీ ఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా 2025 జనవరి నుంచి వేతనాలు కమిషనర్ కార్యాలయం నుంచి పొందుతున్నామన్నారు.

రూ.22750 వేతనానికి బదులు రూ.19500 మాత్రమే ఇస్తున్నారని, మిగతా రావాల్సిన మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని కోరారు. హెచ్‌ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న మూడు నెలల పూర్తి వేతనాన్ని కూడా ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.