24-07-2025 12:18:07 AM
వృద్ధురాలి పై దాడి చేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు
సిరికొండ, జూలై 23 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ కు పాల్పడి, వృద్ధ మహిళ మేడలో నుండి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లి ఘటన సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలో చోటు చేసుకుంది. సిరికొండ ఎస్త్స్ర, రామకృష్ణ, గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం..
న్యావనంది గ్రామానికి చెందిన పిట్ల నర్సవ్వ పెద్దవాల్గొట్ గ్రామంలో తెలిసినవారు మరణించడంతో, వారి కుటుంబాన్ని పలకరించేందుకు, బుధవారం, రావట్ల నుండి నిజాంబాద్ వెళ్లే బస్సులో న్యావనంది నుండి బయలుదేరి పెద్దవాల్గొట్ గిర్ని చౌరస్తాలో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా,వృద్ధ మహిళ అయిన పిట్ల నర్సవ్వ ను వెనకాలే గమనిస్తూ వెంబడిస్తూ వస్తున్న అగాంతకుడు పెద్దవాల్గొట్ గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, బైక్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి రెండు తులాల పుస్తెలతాడును తెంపుకొని బైకుపై పరారయ్యాడు,
ఈ సంఘటనను గమనిస్తున్న పెద్దవల్గొట్ గ్రామానికి చెందిన ఒకతను, చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వాడిని పట్టుకునందుకు బైకుపై వెంబడించగా, అతివేగంతో వెళ్లిన అగాంతకున్ని సదరు వ్యక్తి పట్టుకోలేకపోయాడు. బైకుపై ఉన్న నంబర్ కనబడకుండా ఉండేందుకు నంబరు ప్లేట్ పైన తెల్లని స్టిక్కర్లను అతికించినట్లు గ్రామస్తులు తెలిపారు,ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఎస్త్స్ర జే రామకృష్ణ, ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు,
బాధితురాలి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ, రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర రామకృష్ణ మాట్లాడుతూ, నిజాంబాద్ జిల్లాకు మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో అత్యధికులు, ప్రధాన రహదారిలో గల చౌరస్తాలలో దిగి కాలినడకన గ్రామాల్లోకి చేరుకుంటారని, అలాంటి సమయంలో ఒంటిపైన విలువైన బంగారం వస్తువులను ధరించవద్దని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళవద్దని, అనుమానాస్పదంగా కనబడే, వ్యక్తులను గుర్తించి, సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.