24-07-2025 12:16:44 AM
బాన్సువాడ, జూలై 23 (విజయ క్రాంతి): బాన్సువాడ బస్ స్టాండ్ లో బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి ఆధ్వర్యంలో బుధవారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ 6680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,
బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.