calender_icon.png 19 September, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

19-09-2025 12:00:00 AM

ఎమ్మెస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా

కోదాడ సెప్టెంబర్ 18: పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని ఎమ్మెస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫీజు రియంబర్మెంట్ ను  విడుదల చేయని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామన్నారు. ముందుగా ఖమ్మం క్రాస్ రోడ్ నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు