calender_icon.png 19 September, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ బ్యాంక్‌కు రాజభాష కీర్తి పురస్కారం

19-09-2025 12:00:00 AM

హిందీ దివస్ వేడుకల సందర్భంగా ఘనత

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన 5వ అఖిల భారత రాజభాషా సదస్సులో భాగంగా నిర్వహించిన హిందీ దివస్‌లో 2024 సంవ త్సరానికి గాను రాజభాషా కీర్తి అవార్డులో మూడవ బహుమతిని గెలుచుకుంది. రాజభాష అమలులో దాని ‘అద్భుతమైన పనితీరు‘కి గుర్తింపుగా ఇండియన్ బ్యాంక్ వరుసగా రెండవ ఏడాది ఈ పురస్కారాన్ని అందుకుంది.

రెండు రోజుల పాటు జరిగిన 5వ అఖిల భారత రాజభాషా సదస్సు మొదటి రోజున గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్‌శర్మ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇండియన్ బ్యాంక్ తరపున అధికార భాషా విభాగం, కార్పొరేట్ కార్యాలయం, జనరల్ మేనేజర్ శ్రీ మనోజ్ కుమార్ దాస్ ఈ అవార్డును స్వీకరించారు.