18-09-2025 11:35:37 PM
భద్రాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న
మణుగూరు (విజయక్రాంతి): కేటీపీఎస్, బీటీపీఎస్, వైటిపిఎస్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి నూతనంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లు ఆ సొసైటీ సభ్యులకు జవాబుదారీగా ఉంటూ నాణ్యమైన సేవలను పారదర్శకంగా అందించాలని, భద్రాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న సూచించారు. స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్-1535 నుండి క్రెడిట్ సొసైటీకి ఎన్నికైన డైరెక్టర్లు దాసరి వీరమణి, సిద్ధల హుస్సేన్ లు గురువారం బీటీపీఎస్ కర్మాగారంలో చీఫ్ ఇంజనీర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఘనంగా సన్మానించి, మాట్లాడారు. బాధ్యతాయుతంగా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పని చేస్తూ పవర్ ప్లాంట్ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ రీజినల్ అధ్యక్షుడు వి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎం రాజ మనోహర్, సయ్యద్ రఫీ, ఉపాధ్యక్షులు జాన్ రెడ్డి, పిల్లి మల్లయ్య నాయకులు తోట గోపి, వీరబాబు, నరసింహారావు, మురళి, పుల్లారావు రమ, రమణ, సునీత పాల్గొన్నారు.