17-10-2025 12:43:51 AM
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 16(విజయ క్రాంతి):పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.ఓటర్ జాబితా, తదితర అంశాలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం హరిత హాజరయ్యారు.సీఈఓ మాట్లాడారు.
బూత్ స్థాయి అధికారుల నియామకం, నూతన ఓటర్లకు ఓటర్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై సూచనలు చేశారు. ఓటర్ జాబితా సంబంధించి పెండింగ్ దరఖాస్తులు ఎక్కడైనా ఉంటే కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్ కు బూత్ స్థాయి అధికారి బీఎల్‌ఓ ల నియామకం పూర్తి కావాలని, వారికి ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు.
నూతన ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, వేములవాడ తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ పాల్గొన్నారు.