calender_icon.png 18 October, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు

17-10-2025 12:45:05 AM

ముస్తాబాద్,అక్టోబర్ 16( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం లో బీసీల ఐక్యవేదిక సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీ సంఘాల నాయకులు కార్యాచరణను రూపొందించారు.ఈ సందర్బంగా బీసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలు పోటీ చేయడానికి జాబితాను విడుదల చేసింది.

ఇది ఓర్వలేని రెడ్డి జాగృతికి చెందిన కొందరు బిసి రిజర్వేషన్ అమలును ఆపేందుకు హైకోర్టులో కేసు వేయడం జరిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికన మనకు రావలసిన వాటా మనకు దక్కే వరకు విశ్రమించేది లేదన్నారు.మనమంతా ఐకమత్యంగా ఉంటే రాజ్యాధికారం, రిజర్వేషన్లు సాధ్యమేనని వెల్లడించారు.విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ డబ్ల్యుఎస్ రిజర్వేషన్లను మేము అడ్డుకోలేదని,సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటున్నామే తప్ప ఎలాంటి ఎవరికీ అడ్డుపడలేదని తెలిపారు. ఈనెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ బందును విజయవంతం చేయాలని, రిజర్వేషన్లు సాధించేవరకు మా పోరాటం ఆగదని పిలుపునిస్తూ మండలంలోని అన్ని గ్రామాల బీసీలంతా కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఈడుగురాళ్ల సురేష్ జిల్లా మాజీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్,జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి జేఏసీ నాయకులు సత్తయ్య గౌడ్,తోట దర్మేందర్, గుండెల్లి, శ్రీనివాస్,బాలకృష్ణ గూడూరి భరత్ పిట్ల విట్టల్,గజ్జల రాజు, శ్రీనివాస్,శంకర్ పుల్లూరి రవి పాల్గొన్నారు.