calender_icon.png 18 November, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల బీమా

18-11-2025 01:06:22 AM

-సిరిసిల్ల జిల్లాలోని అందరికీ చెల్లిస్తా

-మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రై వర్లు అందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జి ల్లాలోని ఆటో డ్రైవర్లతో కేటీఆర్ సోమవా రం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జిల్లాలోని దాదాపు 5 వేల మందికి పార్టీ తరపున తాను చెల్లిస్తానని ప్రకటించారు. జిల్లాలోని ఆటో డ్రైవర్లందరి వివరాలను పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నం బర్ కచ్చితంగా సేకరించి బుధవారం సా యంత్రంలోగా అందజేయాలని కేటీఆర్ అ క్కడి నాయకులకు, ఆటో యూనియన్ల వారి కి సూచించారు.

ఈ లిస్ట్ అందిన వెంటనే మూడు, నాలుగు రోజుల్లోనే బీమా చెల్లింపునకు చెక్కులు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉన్నదని గుర్తు చేస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, వారి సంక్షేమానికి చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం అసంఘటిత రంగంలోని డ్రై వర్లందరికీ, కేవలం ఆటో డ్రైవర్లకే కాకుండా, రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల ప్రమా ద బీమా అమలు చేసిందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ప్రమాదం జరిగితే ఈ బీమా ద్వారా చాలామందికి డబ్బు లు అందాయని తెలిపారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన అక్టోబర్ నెల లో ఈ బీమా ప్రీమియంను కట్టకపోవడం తో, ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఆటో డ్రైవర్‌కు కాంగ్రెస్ రూ.24 వేల బాకీ

ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ. వెయ్యి చొప్పున సంవత్సరానికి రూ.12 వేల సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని, అ యితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని కేటీఆర్ విమర్శించారు. ‘రెండేళ్లకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24 వేల బాకీ ఉందని, ముందు ఆ బాకీ కట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంక్షేమ బోర్డును కూడా రెండేళ్లు అవుతున్నా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వా నికి డ్రైవర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు.