25-07-2025 02:45:28 PM
వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీవిద్యపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో(HariHara Trishakti Kshetram) శుక్రవారం ప్రారంభమైన శ్రావణమాసం సందర్భంగా త్రిశక్తులకు (మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి) ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా త్రిశక్తులను దర్శించుకునేందుకై త్రిశక్తి క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.