calender_icon.png 20 November, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ప్రభుత్వం.. కాంగ్రెస్ సర్కార్

16-08-2024 02:06:56 AM

రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ

హనుమకొండ, ఆగస్టు 15(విజయక్రాంతి): ప్రజల సర్కార్.. కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆమె స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం ఆమె ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు.