16-08-2024 02:10:55 AM
జెండా ఎగురవేసిన చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఆసెంబ్లీ ఆవరణలోఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రఘోత్తమ్‌రెడ్డి, దయానంద్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.