calender_icon.png 25 September, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

25-09-2025 10:17:51 PM

ఖమ్మం/కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం నిర్వహించిన  బతకమ్మ సంబరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, స్టూడెంట్స్ తో కలిసి బతకమ్మ ఉస్తవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు, అధికారులకు ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రo లో  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి అందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తో ప్రజలు సంతోషం గా వున్నారన్నారు.