calender_icon.png 25 September, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఘనంగా శాకంబరి అవతారంలో అమ్మవారు

25-09-2025 10:00:41 PM

ప్రత్యేక పూజలు అన్నదానా కార్యక్రమాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో దుర్గామాత అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బిచ్కుంద బాన్సువాడ పిట్లం తదితర మండలాల్లో ఘనంగా శాఖంబరి అవతారంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్, విద్యానగర్, పెద్ద బజార్, వేణుగోపాలస్వామి రోడ్డు, గడి రోడ్డు, ఇందిరానగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఎన్జీవో ఎస్ కాలనీ, శ్రీనివాస నగర్ కాలనీ, పంచముఖ హనుమాన్ కాలనీ, తదితర కాలనీలతో పాటు రామేశ్వరపల్లి, దేవునిపల్లి, పాత రాజంపేట, నరసన్న పల్లి, టేకిరియల్ గ్రామంలో హిందూ యువసేన ఆధ్వర్యంలో  గురువారం  దుర్గామాత మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. హిందూ యువసేన  ఏర్పాటు చేసిన దుర్గ మాత దేవి నవరాత్రుల  ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు  అమ్మవారు శ్రీ కాత్యాయిని దేవి భక్తులకు దర్శనం ఇచ్చారు.

హిందూ యువసేన  కమిటీ కి దాతలుగా షెడ్డు దాత ఉత్తునూరి రవి పాటిల్, విగ్రహ దాతలు కుంటి పెద్ద నర్సిములు, చాకలి లింగం,క్యాతం నారాయణ, పూజ సామాగ్రి దాతలు ఉక్కయ్య గారి రాజేష్, గడ్డమీద ప్రభాకర్, మెడుదుల  గంగాధర్, సెంట్రింగ్ దాతలు పోతారం సంతోష్, పెద్ద పోతన్న గారి రాజేందర్, లడ్డు దాత పొన్నాల భరత్, అన్నదాతలు ఒడ్డెం లింబాద్రి, బండి బబ్లు, మేడదుల శ్రీనివాస్ సాయిపవన్, నిత్య చీరాల దాతలు  శ్రేయన్ పటేల్,హాని పటేల్, దాతలుగా నిలిచారు.  ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.