26-07-2025 03:18:28 PM
సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దారస్ సాయిలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.నూతన రేషన్ కార్డులు అందుకున్న నిరుపేదలకు నెల నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం లభిస్తాయని, ఆ కుటుంబానికి రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజా ప్రభుత్వం నిరుపేదల కోసమే పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దారస్ సాయిలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సలాబత్పూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్ ముంగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ సోమవార్ మహేష్ ముంగ్డే వార్ సంగ్రామ్ పటేల్ మాదాయప్ప స్వామి హనుమాన్లు స్వామి ములేవార్ అశోక్ వెంకటరావు పటేల్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.