ఖైరతాబాద్ వంతెనపై బైక్ నుంచి జారిపడి వ్యక్తి మృతి
21-07-2024 08:11 PM
హైదరాబాద్: నగరంలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఆదివారం ఖైరతాబాద్ వంతెనపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్ నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిని వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.




