04-11-2025 12:00:00 AM
							మఠంపల్లి, నవంబర్ : వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్యలు అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ కేర్ హాస్పిటల్ ను సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాలోతు సక్రు నాయక్, పిఎసిఎస్ వైఎస్ చైర్మన్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మఠంపల్లి మండలంలో ఇంతా మెరుగైన సదుపాయాలతో అనుభవం ఉన్న డాక్టర్ షేక్.మైనుద్దీన్, షేక్.మస్తానిలతో హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం మాలోతు సైదా నాయక్, మాజీ సర్పంచ్లు, ఎంపిటిసిలు, డాక్టర్లు, ఆర్‌ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.