calender_icon.png 4 November, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఎగ్జిబిషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

04-11-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, నవంబర్ 3 (విజయక్రాంతి) : మెడ్ ఎక్స్- 2025 ఎగ్జిబిషన్ ను యువత సద్వినియోగం చేసుకోవాలనీ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం నుండి రెండు రోజులపాటు నిర్వహించే మెడ్ ఎక్స్- 2025 పేరిట నిర్వహించే ఎగ్జిబిషన్ ను  ఆయన ప్రారంభించారు. తదుపరి విద్యార్థులచే  ఏర్పాటుచేసిన స్టాల్స్ లలో సి పి ఆర్ , శరీర బాగాల పని విధానంలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యక్ష వర్క్ షాప్ లు, క్లినికల్ ప్రదర్శనలు, వైద్య నిపుణలతో సంభాషణ, అత్యాధునిక ల్యాబ్ లు, మ్యూజియం సందర్శన, వైద్య విద్యార్థి జీవితం పై సీనియర్ వైద్యులు, ప్రొపెసర్లు లాంటి నిపుణుల ప్రసంగం, కెరియర్ గైడెన్స్ కు అవకాశం లభిస్తుందన్నారు. అలాగే ఈ ఎగ్జిబిషన్ లో 8వ తరగతి నుండి ఇంటర్ రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు హాజరై పాల్గొని వాటిపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు.

తదుపరి వైద్య కళాశాల ప్రిన్సిపల్ జయలలిత మాట్లాడుతూ మొదటి రోజు మేడ్ ఎక్స్- 2025 ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 1700 మంది సందర్శించారని రెండవరోజు మంగళవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, జీమియా, హెచ్ ఓ డి లు బాబురావు, కృష్ణయ్య, గురు రాజ్, శ్రీకాంత్, తరుణీ, గీత, ఈశ్వరమ్మ, రాధిక, యస్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.