calender_icon.png 24 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ వ్యాధి బారినపడి ఏ ఒక్క వ్యక్తి చనిపోకుండా చర్యలు తీసుకోవాలి

23-07-2025 09:41:35 PM

క్షయ వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే, మెరుగైన వైద్యం అందించాలి..

క్యాటరాక్ట్ సర్జరీలు అవసరం ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా సర్జరీ చేయించాలి..

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో క్షయ వ్యాధి బారినపడి ఏ ఒక్కరు చనిపోకుండా క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాథమిక స్థాయిలోనే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 408 క్షయ వ్యాధి పాజిటివ్ కేసులను గుర్తించడం జరిగిందని అదేవిధంగా క్షయ వ్యాధి వల్ల 12 మంది చనిపోవడం జరిగిందని చెప్పారు. ఇక మీదట ఏ ఒక్కరూ క్షయ వ్యాధితో చనిపోవడానికి వీలులేదని అందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు క్షయ వ్యాధి రోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స నిర్వహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయని వైద్యులు సైతం ఉన్నారని అందువల్ల జిల్లాలోని క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుచున్న వారందరికీ ఉచితంగా శాస్త్ర చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  వర్షాకాలం ఉన్నందున  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధులను కట్టడి చేయాలని ఆదేశించారు.  జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో వంటలు చేసే వారికి వైడల్ పరీక్షలు చేయించాలని, ఎవరికైన పాజిటివ్ వస్తె వంట చేయకుండా వారం రోజుకు క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందించాలని వైద్యులను సూచించారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటు, కుక్క కాటుకు  మందులు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసరం అయినపుడు వెంటనే వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డాక్టర్ పరిమళ, డాక్టర్ చైతన్య, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రంగారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు