ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
22-06-2026 12:00 AM
సర్పంచ్ దున్నా శ్రీనివాస్
కోదాడ (నడిగూడెం), జాన్ 21: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లక్ష్మి కంటి ఆస్పత్రి కోదాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య పరీక్షలు అనంతరం కళ్ళజోడులు అవసరమైన వారికి తక్కువ ఖర్చుతో అందించినట్లు, ఆపరేషన్ అవసరం అయినవారికి కోదాడ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బద్ది రాంచందర్,మదార్, నాయకులు చిల్లంచర్ల సత్యనారాయణ, కారం శేట్టి యుగంధర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






