05-01-2026 02:20:27 AM
ఐయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ నవీన్ నికోలస్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): రెండో రోజు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రెండో రోజైన ఆదివారం 82 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షకు ఉదయం సెషన్‌కు 22,546 మందికి గానూ 18,235 (80.88 శాతం) మంది హాజరుకాగా, 4311 మంది గైర్హాజరయ్యారు.
మధ్యాహ్నం సెషన్‌కు 22,912 మందికిగానూ 18,819 (82.03 శాతం) మంది హాజరుకాగా, 4093 మంది డుమ్మా కొట్టారు. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని ఐయాన్ డిజిటల్ జోన్‌లోని పరీక్షా కేంద్రాన్ని డైరెక్టర్ నవీన్ నికోలస్ సందర్శించారు. పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగాలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం కూడా టెట్ పరీక్ష జరగనుంది. ఇదిలా ఉంటే ఆదివారం టెట్ పేపర్ కొంచెం కఠినంగా, కాస్త సులువుగా ప్రశ్నల సరళి ఉన్నట్లు పలు అభ్యర్థులు తెలిపారు.