03-01-2026 09:37:30 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని 13 గ్రామపంచాయతీలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో సిఎంఆర్ఎఫ్ 24 చెక్కులు 5,79,500 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం మండల అధ్యక్షుని అనుమతితో ఆయా గ్రామాల సర్పంచులు గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని మండల ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కంపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్, గ్రామస్తులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.