01-01-2026 02:08:24 AM
సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి
రామాయంపేట, డిసెంబర్ 31 : రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ముందడుగు వేశా రు. స్థానిక రామాలయం పరిసరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బోరు బావి తవ్వకం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రామాలయానికి నిత్యం వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే కాకుండా, సమీప కాలనీ వాసుల నీటి సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించడమే లక్ష్యమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, దశలవారీగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.