calender_icon.png 1 January, 2026 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ నిర్వహణ చేయరాదా?

01-01-2026 02:09:50 AM

- ప్రజావాణిలో 50 ఫిర్యాదులు గజ్వేల్‌వే

- గజ్వేల్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి

గజ్వేల్, డిసెంబర్ 31: మున్సిపాలిటీ నిర్వహణ చేయరాదా అంటూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై జిల్లా కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో చెత్త చెదారం తో పాటు అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచలేని వారు మునిసిపాలిటీని ఎలా శుభ్రంగా ఉంచుతారని ప్రశ్నించారు. ప్రజావాణిలో 63 దరఖాస్తులు ఉంటే అందులో 50 దరఖాస్తులు గజ్వేల్ నుండి వచ్చినవే ఉన్నాయన్నారు.