01-12-2024 02:51:53 AM
వివరాలు సేకరించిన ఎన్యూమరేటర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి శనివారం ఎన్యుమరేటర్లు వెళ్లి ఆమె కుటుంబ సభ్యుల వివరాలను సర్వేలో నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, సూపర్‌వైజర్ గంగాధర్, ఎన్యూమరేటర్ రమేష్ పాల్గొన్నారు.
అదేవిధంగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రిపురంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు కుటుంబ సర్వే నిర్వహించారు. ఎన్యూమరేటర్ మాధవి, సూపర్‌వైజర్ ఉపేందర్ ఆయన కుటుంబ వివరాలను సేకరించారు. చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పాల్గొన్నారు.