10-10-2025 05:53:06 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దీపావళి పండుగను పురస్కరించుకొని సరైన అనుమతులు పొంది తాత్కాలిక బాణాసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలలో సంబంధిత శాఖల అనుమతి లేకుండా ఎవరు బాణసంచాను విక్రయించకూడదని, బాణసంచా అమ్మకాల కోసం తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం సంబంధిత ప్రతిపాదనలను సబ్-కలెక్టర్- కాగజ్‌నగర్, సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ - ఆసిఫాబాద్ ద్వారా ఈ కార్యాలయానికి దీపావళి పండుగకు కనీసం ఒక వారం ముందుగా పంపించాలని తెలిపారు. సరైన అనుమతి లేకుండా బాణసంచాను విక్రయించినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఆయా మండలాల తహసీల్దారులు బాధ్యత వహించాలని తెలిపారు.