07-08-2025 12:30:02 AM
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు
తూప్రాన్, ఆగస్టు 6 : ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారన్న సమాచారంలో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు స్థలాలను పరిశీలించి కబ్జాదారులకు హెచ్చరికలు జారీ చేసి పనులను నిలిపివేశారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ సమీపంలో గల సర్వే నంబర్ 73లో ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి చదును చేస్తున్నారని రెవెన్యూ అధికారుల దృష్టికి గ్రామస్తులు పలుమార్లు తీసుకురావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి అందులో సిమెంటు పలకలు వేస్తున్న పనులను నిలిపివేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే తూప్రాన్ పట్టణంలోని గీతారెడ్డి కాలనీలో సర్వే నంబర్ 234లో 600 గజాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి పలకలు వేశారు. దీంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జాకు గురి చేస్తే చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ ఆర్‌ఐ. ప్రేమ్ కుమార్‌హెచ్చరించారు.