calender_icon.png 19 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎంకే దుష్టశక్తి.. టీవీకే పవిత్రమైనది

18-12-2025 03:43:16 PM

ఈరోడ్: ఈరోడ్‌లో జరిగిన టీవీకే బహిరంగ సభలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విఫలమైన పాలన, నెరవేర్చని వాగ్దానాలు, అవినీతికి పాల్పడుతోందని ఆ ప్రభుత్వాన్ని ఆయన ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకేను ఒక దుష్టశక్తిగా అభివర్ణిస్తూ, తన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని  స్వచ్ఛనది, పవిత్రమైన శక్తిగా ఆయన ప్రజలకు పరిచయం చేశారు.

ద్రవిడ పార్టీని లక్ష్యంగా చేసుకోవడానికి దివంగత ఏఐఏడీఎంకే దిగ్గజాలైన ఎంజి రామచంద్రన్, జె.జయలలిత తరచుగా ఉపయోగించే పదాన్నే ఆయన పునరావృతం చేశారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఒక స్వచ్ఛమైన శక్తి అని, బహుశా 2026 ఎన్నికల పోరులో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత, తమిళనాడులో ఆయన పాల్గొన్న మొదటి బహిరంగ కార్యక్రమం ఇదే. ఆ తర్వాత ఆయన కాంచీపురంలో కొద్దిమందితో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా పొరుగున ఉన్న పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక సభలో ప్రసంగించారు.

సాంస్కృతిక ప్రతీకలను ప్రస్తావిస్తూ, విజయ్ పసుపును సాంప్రదాయకంగా ఏదైనా మంచి పనిని ప్రారంభించేటప్పుడు ఉపయోగిస్తారని, పసుపుకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉందన్నారు. అది తమిళ జెండాలో కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పసుపు పండే పవిత్ర భూమిగా ఈరోడ్‌ను అభివర్ణిస్తూ, ఆయన ఆ ప్రాంత గుర్తింపును వ్యవసాయంతో ముడిపెట్టారు. నీటిపారుదల గురించి మాట్లాడుతూ విజయ్ కాళింగరాయన్ కాలువను ప్రస్తావించి, వ్యవసాయం అభివృద్ధి చెందడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. కాళింగరాయన్ తల్లి పెరుగు, పాలు అమ్మి సంపాదించిన డబ్బును కాలువ నిర్మాణం పూర్తి చేయడానికి ఇచ్చిందని ఆయన చెప్పారు. అమ్మ మద్దతు ఉంటే దేన్నైనా సాధించవచ్చని, ఈరోడ్ ప్రజలు తనపై చూపిస్తున్న విశ్వాసం కూడా తనకు అలాంటి బలాన్నే ఇస్తోందని విజయ్ తెలిపారు.