18-12-2025 04:00:18 PM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు పెరిగిపోయాయని, యాసంగి రైతుబంధు ఇంకెప్పడు విడుదల చేస్తారని అడిగారు. సాగు చేసేవారికే రైతుబంధు అంటూ లీకులు ఇస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు 5 డిమాండ్ చేశారు. యాప్ లు లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని, రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా రూ.1800 కోట్ల బోనస్ చెల్లించాలని, రైతులందరికీ రైతుబంధు నిధులు జమ చేయాలని, మెదక్ జిల్లా రైతులకు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌లు కావాలని కాంగ్రెస్ అంటుందన్నారు. యూరియా సరఫరా చేయడం చేతగాక ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటుందని, ఇది అనాలోచిత తుగ్లక్ చర్య అని ఎద్దేవా చేశారు. తక్షణమే దీన్ని విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.