calender_icon.png 3 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ అల్లర్లపై అఖిలపక్ష నేతల సమావేశం

06-08-2024 10:43:55 AM

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లపై అఖిలపక్ష నేతల సమావేశం అయింది. కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ తరుపున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే హాజరయ్యారు. భారత్ సరిహద్దుల్లో పరిస్థితులపై అఖిలపక్ష నేతలకు విదేశాంగమంత్రి వివరించనున్నారు.

బంగాల్, అసోం ప్రాంతాల్లో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భద్రత బలగాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. గత రెండు రోజులుగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే  బీఎస్ఎఫ్ చీఫ్ మకాం వేశారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం ప్రభుత్వం బంగ్లాలో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతో గత రాత్రి సమీక్షించారు.