calender_icon.png 19 May, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ నిర్మూలనకు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం

19-05-2025 04:43:39 PM

ప్రభుత్వ డాక్టర్ లింగమూర్తి..

తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినట్లయితే క్షయవ్యాధి నివారించబడుతుందని ప్రభుత్వ వైద్యాధికారి లింగమూర్తి అన్నారు. తుంగతుర్తి మండలంలోని వెలుగుపెల్లి గ్రామంలో నిక్షయ శివిర్-2 క్యాంపు నిర్వహించి 24 మంది నుండి స్పుటము నమూనాలను సేకరించి  ల్యాబ్ కు పంపడం జరిగింది.  45 మందికి క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఎక్స్ రే తీయడం జరిగింది. ఈ కార్యక్రమంల డాక్టర్ విజయ్ కుమార్, రవికుమార్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కిరణ్, హెల్త్ అసిస్టెంట్స్ గాజుల సోమన్న, యాదగిరి, నరసింహ చారి, ఏఎన్ఎం. స్వప్న, ఆఫ్రిన్, రవి, ఆశాలు, జయమ్మ, పద్మ, సుజాత, కమలమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.