calender_icon.png 19 May, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుచ్చలపల్లి స్ఫూర్తితో ఉద్యమించాలి

19-05-2025 04:38:59 PM

సిపిఎం రాష్ట్ర నేత నాగయ్య పిలుపు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దివంగత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. సుందరయ్య జీవితం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం, వ్యవసాయ కూలీల బతుకుల కోసం, వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి వారి హక్కుల కోసంనిత్యం పోరాటాలు చేశాడని కొనియాడారు. సుందరయ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, ఉమారాణి, రవి, బేబీ, ప్రవీణ్, ప్రియాంక,  గోపీచంద్, నీలా, కృష్ణ, శృతి, కీర్తన, అనూష పాల్గొన్నారు.