30-06-2025 12:00:00 AM
ఒక ఇల్లు ఇద్దరు పిల్లలు
ఒంటరి కుటుంబాలు,
అనుమానపు ఆలుమగలు,
సంరక్షణ లేని పెంపకం
ఉమ్మడిగా కలిసి బతికే రోజులకు
నెమ్మది నెమ్మదిగా
చరమగీతం పాడేస్తూ
పసివారిని పెద్దలకు
దూరంగా పెంచుతూ,
విద్యార్థి దశ వచ్చినాక
వింత పోకడలకు తావిస్తూ
తల్లిదండ్రులై ఉండికూడా
మమకారం లేని తండ్రి,
మాతృత్వం చూపని తల్లి
అడ్డనుకున్నా మరుక్షణం
పెరుగన్నమే పిల్లల పాలిట
మృత్యుగానమై మారిపోతున్న
ఈ కాలం మారాలి..
మంచి మనసున్న
అమ్మానాన్నలు కావాలి!