03-11-2025 02:38:04 AM
							రాజేశ్ ధ్రువ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజాచిత్రం ‘పీటర్’. సుకేశ్ శెట్టి రచనాదర్శకత్వంలో సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేశ్ హెగ్గడే నిర్మిస్తున్నారు. జాన్వి రాయల, రవిక్ష శెట్టి ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే..
కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన డైలాగులు ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి. ఇందులోని విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: గురుప్రసాద్ నార్నాడ్; సంగీతం: రిత్విక్ మురళీధర్; ఎడిటర్: నవీన్ శెట్టి; ఆర్ట్: దేవరాజ్.