02-09-2025 03:34:39 PM
అనంతగిరి: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమపంగు రాధాకృష్ణ, జిల్లా కోశాధికారి గుండు సురేష్, మండల అధ్యక్షులు డేగ హనుమంతు ఆధ్వర్యంలో అనంతగిరి ఎంపీడీవో హరి సింగ్(MPDO Hari Singh)కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు పరిష్కారం చేయాలని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో 51 జీవోను సవరించాలని ఒకటో తారీఖునే గ్రీన్ ఛానల్ ద్వారా ఇస్తానన్న కార్మికుల జీతాలు చెల్లించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని కార్మికులందరికీ ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయాలని కార్మికులకు సంవత్సరానికి రెండు జతలు బట్టలు ఇవ్వాలని సబ్బులు బ్లౌజులు కొబ్బరి నూనె చెప్పులు టవల్స్ బ్లౌజులు వెంటనే చెల్లించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సమావేశాల్లోనే గ్రామపంచాయతీ కార్మికుల ఇచ్చిన హామీలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించాలని వారి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.