calender_icon.png 27 July, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

24-07-2025 12:15:25 AM

కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్

బాన్సువాడ జులై 23 (విజయ క్రాంతి): హైదరాబాదులో టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ ఛలో గన్ పార్క్ పిలుపు మేరకు బుధవారం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా నుండి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నాటి ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులకు నివాళులు అర్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు న్యాయం చేయవలెనని నిరసన కార్యక్రమం చేయడమైనది.