25-07-2025 01:42:03 AM
విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్‌ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిన దొంగలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో సూత్రదారులు, పాత్రదారుల పాత్ర తేలాల్సి ఉందన్నారు. కలుగులో దా క్కున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేసే బీఆర్‌ఎస్ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదన్నారు.