25-07-2025 01:41:11 AM
ఇళ్ల స్థలాల సమస్యపై ఎలా చేస్తే జర్నలిస్టులకు మేలు చేకూరుతుందో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం
టీయూడబ్ల్యూజే(ఐజేయూ)4వ జిల్లా మహాసభలో మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మం, జులై 24 (విజయ క్రాంతి):ఇందిరమ్మ ప్రభుత్వ ఏర్పడ్డంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని, జర్నలిస్టుల సేవలు ఎప్పు డు మరవమని, తప్పకుండా జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైరాలోని శబరి గార్డెన్స్లో గురువా రం జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 4వ జిల్లా మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేరువేరుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వారు ప్రసంగించారు.
రంగ రంగ వైభవంగా వైరా పట్టణంలో ఏర్పాటు చేసుకున్న ఐజేయూ మహాసభకు రావడం ఆనందంగా ఉంది.ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, నిజాన్ని వెలికితీయడంలో జర్నలిస్టులు ఎంతో శ్రమిస్తారని అన్నారు. నూతన అక్రిడేషన్ జారీ విధివిధానాలపై సోమ లేదా మంగళవారాల్లో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందో ఓ నిర్ణయం తీసుకుం దాం అని మంత్రి పొంగులేటి అన్నారు.
దీని పై ఓ స్పష్టత వస్తే హెల్త్ కార్డులు ఇవ్వడమనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇందిరమ్మ ప్రభు త్వం వచ్చేదాంట్లో జర్నలిస్టులు కూడా ప్రధా న పాత్ర పోషించారని వారు అన్నారు. జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైరా సత్తుప ల్లి ఎమ్మెల్యేలు మా లోతు రాందాస్ నాయ క్, మట్టా రాగమయి దయానంద్, టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు విరహత అలీ, కార్యదర్శి రాంనారాయణ, యూనియన్ నాయకులు నర్వనేని వెంకట్రావు, మైసా పాపారావు, నలజాల వెంకటరావు, రవీంద్ర శే షు, మాటేటి వేణుగోపాల్, ఏనుగు వెంకటేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.