17 April, 2026 | 2:07 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

ఆటపాటలతో కూడిన విద్యతోనే చిన్నారుల్లో శారీరక, మానసిక వృద్ధి

12-06-2025 01:31 AM

సూర్యాపేట, జూన్ 11 (విజయక్రాంతి) : అంగన్ వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య అందించడంతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డిడబ్ల్యూఓ కె.నర్సింహా రావు అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో అమ్మమాట -అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలకు ముందు పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు యూనిఫామ్స్, ఫ్రీస్కూల్ బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుబ్బలక్ష్మి, సూపర్వైజర్ వీరమ్మ, ఏఎన్‌ఎమ్ పద్మజ, అంగన్వాడీ టీచర్లు రమణ, సుజాత, సలోమి, ఆశా కార్యకర్తలు అర్చన, వెంకటమ్మ, సునీత, స్వర్ణలత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.